తెలంగాణ

telangana

సరదాగా అడవిలోకి ఎస్పీ దంపతులు- ఒక్కసారిగా ఏనుగుల దాడితో..

By

Published : Nov 4, 2021, 2:54 PM IST

ఏనుగుల దాడిలో (elephant attack news today) గౌరెల్లా-పెండ్రా-మర్వాహీ జిల్లా ఎస్పీ, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. గజరాజులను చూడటానికి సరదాగా వెళ్లిన క్రమంలో ఏనుగుల గుంపు వారిపై దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్​గఢ్​లో ఈ ఘటన జరిగింది.

elephant attack news today
ఎనుగుల దాడి

ఛత్తీస్​గఢ్​లో విషాదకర ఘటన జరిగింది. ఏనుగుల దాడిలో (elephant attack news today) గౌరెల్లా-పెండ్రా-మర్వాహీ జిల్లా ఎస్పీ త్రిలోక్ బన్సాల్, ఆయన భార్య శ్వేతా బన్సాల్​ తీవ్రంగా గాయపడ్డారు. గజరాజులను చూడటానికి సరదాగా వెళ్లిన వీరిపై ఏనుగుల గుంపు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.

గాయపడిన ఎస్పీ త్రిలోక్ బన్సాల్

మర్వాల్​ అటవీ ప్రాంతంలోకి దాదాపు 14 ఎనుగులు వచ్చినట్లు సమాచారం అందగా.. ఎస్పీ, ఆయన భార్య వాటిని చూడాలనుకున్నారు. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతానికి స్థానిక గ్రామస్థులు, కొంత మంది పోలీసులతో కలిసి వెళ్లారు. ఏనుగుల పరిరక్షణ బృందం కూడా వారిని అనుసరించింది. గజరాజులకు మరీ దగ్గరగా వెళ్లకూడదని హెచ్చరికలు కూడా జారీ చేసింది ఆ బృందం. అవేవీ పట్టింటుకోకుండా వాటికి దగ్గరగా వెళ్లారు ఎస్పీ. కోపంతో ఏనుగుల గుంపు ఒక్కసారిగా (elephant attack man) విరుచుకుపడింది. ఈ దాడిలో ఎస్పీ, ఆయన భార్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. కొంతమంది పోలీసులూ గాయపడ్డారు.

దాడి చేసిన ఏనుగుల గుంపు

ఏనుగుల పరిరక్షక బృంద సభ్యులు గజరాజులను బెదిరించి అక్కడి నుంచి పారిపోయేలా చేశారు. గాయపడినవారిని బిలాస్​పుర్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:వందల ఏళ్లుగా దీపావళికి ఆ గ్రామం దూరం- ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details