Sunil Jakhar BJP: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ భాజపాలో చేరారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ను వీడిన జాఖడ్.. ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్‌పై విరుచుకుపడ్డారు. పార్టీ చిత్రీకరించినట్లుగా ఆయన అంత బలవంతుడేమీ కాదన్నారు. పంజాబ్ కాంగ్రెస్ నాయకులు కొందరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించిన నేపథ్యంలో జాఖడ్‌ను పదవుల నుంచి తొలగించింది అధిష్ఠానం.
కాంగ్రెస్‌కు షాక్.. భాజపాలోకి పార్టీ సీనియర్ నేత! - sunil jakhar bjp
Sunil Jakhar BJP: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ పార్టీలో చేరారు పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్. కాంగ్రెస్‌ను వీడిన జాఖడ్.. ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
Sunil Jakhar joins BJP
కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబికా సోనీపై జాఖడ్ విమర్శలు గుప్పించారు. పంజాబ్‌లో హిందూ ముఖ్యమంత్రి ఉండటం వల్ల కలిగే పరిణామాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి సోనీ కూడా ఓ కారణమని ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తానెప్పుడు రాజకీయాలను ఉపయోగించుకోలేదన్నారు.
ఇదీ చదవండి:కాంగ్రెస్‌కు హార్దిక్ గుడ్‌బై- వారిపై 'చికెన్ సాండ్విచ్' పంచ్
Last Updated : May 19, 2022, 2:53 PM IST