తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తిండి లేకుండా.. 'సోలార్ ఎనర్జీ'తో పాతికేళ్లు బతికిన వ్యక్తి మృతి - హీరా రతన్ మానెక్ వార్తలు

Hira Ratan Manek passes away: సాధారణ ఆహారం కాకుండా, సూర్యరశ్మిని గ్రహించి ఏళ్ల పాటు జీవించిన హీరా రతన్ మానెక్.. ప్రాణాలు కోల్పోయారు. కోజికోడ్​లోని తన ఇంట్లో కన్ను మూశారు. సోలార్ ఎనర్జీతో ఆహారం లేకుండానే బతకొచ్చని చెబుతూ దాన్ని నిరూపించారు హీరా.

Hira Ratan Manek
Hira Ratan Manek

By

Published : Mar 13, 2022, 7:31 PM IST

Updated : Mar 13, 2022, 10:11 PM IST

Hira Ratan Manek passes away: ఆహారం తీసుకోకుండా ఏళ్ల పాటు జీవనం సాగించిన హీరా రతన్ మానెక్(84).. ప్రాణాలు కోల్పోయారు. కేరళ కోజికోడ్​ చకోరతుకులంలోని తన ఫ్లాట్​లో ఆదివారం తుది శ్వాస విడిచారు. 1995 నుంచి ఆయన ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదు. నీరు, సోలార్ ఎనర్జీతో గడిపేస్తున్నారు. శరీరంపై పడే సూర్యరశ్మిని గ్రహించి బతికేవాడినని ఆయన చెప్పేవారు.

మానెక్ కుటుంబానిది గుజరాత్​లోని కచ్. పడవల వ్యాపారం చేసే ఆయనకు సోలార్ హీలింగ్ గురించి 1962లో తెలిసింది. పుదుచ్చేరిలోని అరబిందో ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాత సూర్యుడిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. 1992 నుంచి సూర్యుడిని దైవంలా కొలవడం ప్రారంభించారు.

హీరా రతన్ మానెక్

Sun Gazing Hira Ratan Manek

సూర్యుడిని నేరుగా కళ్లతో చూడటంలో మానెక్ దిట్ట. తొలుత సెకన్ల పాటే సూర్యుడిని నేరుగా చూడటం అలవాటు చేసుకున్న ఆయన.. క్రమంగా ఆ సమయాన్ని గంట వరకు పెంచుకోగలిగారు. ప్రతిరోజు సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో గంట చొప్పున సూర్యుడిని కళ్లతో నేరుగా చూసేవారు. ఇలా చేయడం ద్వారా శరీరంలో ఎనర్జీ పెరుగుతుందని ఆయన చెప్పేవారు. ఫలితంగా ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదని, ఆకలి అనేది ఉండదని చెబుతుండేవారు.

1995లో కోజికోడ్​లో డాక్టర్ సీకే రామచంద్రన్ పర్యవేక్షణలో 213 రోజుల పాటు ఉపవాసం చేశారు మానెక్. సూర్యరశ్మిలోనే గడుపుతూ.. దాహమైనప్పుడు నీరు తాగి ఈ ఉపవాసంలో పాల్గొన్నారు. 2000 జనవరి 1 నుంచి 2002 ఫిబ్రవరి 15 వరకు 411 రోజుల పాటు అహ్మదాబాద్​లో ఉపవాసం చేశారు. ఈ ఉపవాసాలతో.. ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.

'వ్యోమగాములూ బతకొచ్చు..'

ఆయనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు, నాసా శాస్త్రవేత్తలు సైతం ప్రయోగాలు చేశారు. అమెరికాలోని కెన్నెడీ స్పేస్​ సెంటర్​కు వెళ్లి లెక్చర్​లు కూడా ఇచ్చారు. వ్యోమగాములు సూర్యుడిని పూజిస్తే అంతరిక్షంలో ఎక్కువకాలం ఆహారం లేకుండా జీవించొచ్చు అని మానెక్ విశ్వసించేవారు. ఈ విషయాన్ని తాను రాసిన పుస్తకాల్లో వివరించారు. ఇందుకు సంబంధించి 50కి పైగా దేశాల్లో అనేక ప్రసంగాలు ఇచ్చారు. అయితే, తాను చెప్పిన విషయాలకు భారత్​లో పెద్దగా గుర్తింపు లభించలేదని గతంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:పర్స్​లు కొట్టేస్తూ అడ్డంగా దొరికిన నటి.. స్పాట్​లోనే అరెస్ట్

Last Updated : Mar 13, 2022, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details