తెలంగాణ

telangana

ETV Bharat / bharat

38 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పిన 'కురూప్'​.. గుజరాత్​లో స్వామీజీలా!

Kerala Kurup: హత్య కేసులో 38 ఏళ్లుగా కేరళ పోలీసులు వెతుకుతున్న సుకుమార కురూప్​ను తాను చూశానని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. అతను స్వామీజీ అవతారం ఎత్తి గుజరాత్​లో ఉన్నట్లు పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఆ రాష్ట్రంలోనూ దర్యాప్తు జరపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Sukumara Kurup living as an ascetic in Gujarat
స్వామీజీ అవతారంలో కురూప్​

By

Published : Feb 9, 2022, 5:27 PM IST

Sukumara Kurup: చాకో హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సుకుమార కురూప్​.. గుజరాత్​లో స్వామీజీ అవతారంలో జీవిస్తున్నాడని కేరళ పథానంథిట్టకు చెందిన వ్యక్తి పోలీసులకు చెప్పాడు. అతడు చూడటానికి అచ్చం కురూప్​ లాగే ఉన్నాడని పేర్కొన్నాడు. పోలీసులు కురూప్​ కోసం 38 ఏళ్లుగా గాలిస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఆచూకీ దొరకలేదు.

పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి పేరు రేంజీ ఇస్మాయిల్​. కేరళలో కూల్​డ్రింక్స్​ స్టోర్​కు మేనేజర్​గా పనిచేస్తున్నాడు. 2007లో గుజరాత్​లో తాను ఓ స్వామీజీని కలిశానని, అతడు అచ్చం కురూప్ లాగే ఉన్నాడని తెలిపాడు. ఆయన పేరు శంకర గిరి అని తనతో చెప్పాడని పేర్కొన్నాడు. తాను అక్కడ టీచ్​గా​గా పని చేశానని వివరించాడు. నెల రోజుల అనంతరం పేపర్​లో కురూప్​ ఫొటో చూసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించాడు. అయితే వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నాడు.

ఇప్పుడు మరోసారి కురూప్​ తనకు కనిపించాడని ఇస్మాయిల్ చెబుతున్నాడు. గతేడాది డిసెంబర్​లో హరిద్వార్​లో కురూప్​ను ట్రావెల్ వ్లాగ్​లో చూశానని తెలిపాడు. అనుమానం వచ్చి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సీఎం పినరయి విజయన్​ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వివరించాడు.

ఇస్మాయిల్ సమాచారం అనంతరం కురూప్​ కేసు దర్యాప్తును గుజరాత్​లోనూ జరపాలని క్రైంబ్రాంచ్ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

1984లో జరిగిన చాకో హత్య ఘటన కేరళలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకుమార కురూప్​ కోసం పోలీసులు 38 ఏళ్లుగా గాలిస్తున్నారు. కేరళ చరిత్రలోనే అత్యధిక కాలం పెండింగ్​లో ఉన్న కేసు ఇదే కావడం గమనార్హం.

ఇదీ చదవండి:విస్తృత ధర్మాసనానికి హిజాబ్​ కేసు- కళాశాలల బంద్​తో కాస్త ప్రశాంతత!

ABOUT THE AUTHOR

...view details