Suicide attempt on railway track: మహారాష్ట్ర ముంబయిలోని శివ్డీలో ఓ వ్యక్తి రైలు పట్టాలపై పడుకుని ఆత్యహత్యకు ప్రయత్నించాడు. అయితే అతడిని గమనించిన లోకల్ ట్రైన్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. సడెన్ బ్రేక్ వేసి ప్రాణాలు నిలిపాడు.
ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని 59ఏళ్ల మధుకర్ సాబ్లేగా గుర్తించారు. అతడు పట్టాలపై పడుకోవడాన్ని గమనించిన మహిళా కానిస్టేబుల్ ధనశ్రీ పండిత్ శెలార్, హోంగార్డు రితుజా మాండే ఏమాత్రం ఆలోచించకుండా కాపాడేందుకు పరుగులు తీశారు. ఈ సమయంలోనే ట్రైన్ డ్రైవర్ బ్రేక్ వేయడం వల్ల వారు ఊపిరి పీల్చుకున్నారు. మధకర్ను పట్టాలపై నుంచి తీసుకొచ్చారు.