చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ప్రయాణికులు హడల్.. 12 నిమిషాల్లోనే.. Chennai Bangalore Express Train Smoke : చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు రావడం కలకలం రేపింది. వెల్లూర్‌లోని కట్‌పడి స్టేషన్ దాటి.. రైలు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఈ పరిణామంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పొగలు రావడం గమనించిన లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన రైల్వే సిబ్బంది అక్కడకి చేరుకున్నారు. ఇంజిన్‌లోని బ్రేక్ సిస్టమ్‌లో తలెత్తిన సమస్య కారణంగా పొగలు వచ్చినట్లు గుర్తించారు. కేవలం 12 నిమిషాల్లోనే మరమ్మతులు చేయడం వల్ల రైలు గమ్యస్థానానికి బయల్దేరి వెళ్లింది. రైలులో మంటలు చెలరేగకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు రావడంపై రైల్వే అధికారులు స్పందించారు. రైలు ఇంజిన్‌లో బ్రేక్ సిస్టమ్‌లో తలెత్తిన సమస్య కారణంగానే పొగలు వచ్చాయని తెలిపారు. రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు.
చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలులో చెలరేగిన పొగలు బోగిలో పొగలు.. ప్రయాణికులు హడల్..
Secunderabad Agartala Express Smoke : కొన్నాళ్ల క్రితం.. సికింద్రాబాద్ నుంచి అగర్తలా వెళ్తున్న రైలు బ్రహ్మపుర స్టేషన్‌కు చేరుకోగానే B5 కోచ్‌లో పొగలు చెలరేగాయి. రైలులో పొగ రావడం చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. రైలులో ప్రయాణిస్తున్న కొంతమంది బీ5 కోచ్ నుంచి పొగ రావడం చూసి.. అత్యవసర అలారంను మోగించారు. మరికొంత మంది రైలునుంచి దిగి అందులో ప్రయాణించేది లేదని తేల్చి చెప్పారు. తక్షణమే మరొక కోచ్‌ను ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేశారు. అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. ఎయిర్ కండిషనర్‌లో జరిగిన చిన్న షాట్ సర్య్కూట్ వల్ల కోచ్‌లో పొగ ఏర్పడి ఉండవచ్చని రైల్వే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ ఏడాది జూన్ 6న సీల్దా-అజ్మేర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైలులో ఉన్న ప్రయాణికులు.. అధికారులకు ప్రమాద సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా మీదుగా సీల్దా-అజ్మేర్ ఎక్స్‌ప్రెస్ వెళ్తుండగా రైలులో మంటలు చెలరేగాయని రైల్వే అధికారులు చెప్పారు. ఈ పూర్తి వార్త కోసం క్లిక్ చెయ్యండి.