నిందితులను పట్టుకునేందుకు పోలీసులు మనుషులను విచారించిన ఘటనలు చాలానే చూశాం. అయితే లిక్కర్ మాఫియా గ్యాంగ్‌ను పట్టుకునేందుకు బిహార్ పోలీసులు విచిత్రంగా ఓ చిలుకను విచారిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే?
లిక్కర్ మాఫియా కేసులో చిలుకను విచారించిన పోలీసులు.. సమాధానాలతో షాకిచ్చిన ప్యారెట్! - బిహార్ లిక్కర్ మాఫియా గ్యాంగ్ న్యూస్
లిక్కర్ మాఫియా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఓ చిలుకను విచారించారు!. అవునండీ మీరు చదివింది నిజమే. ప్రస్తుతం ఆ చిలుక విచారణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే?
గయాలో లిక్కర్ మాఫియా గ్యాంగ్‌కు సంబంధించి సమచారం అందుకున్న పోలీసులు.. వారిని పట్టుకునేందుకు ఓ ఇంటికి వెళ్లారు. అయితే పోలీసులు వెళ్లేసరికి మద్యం వ్యాపారి కుటుంబం మొత్తం అక్కడి నుంచి పరారైంది. కానీ ఆ ఇంట్లో పంజరంలో మిథూ మియాన్ అనే ఓ చిలుక ఉండిపోయింది. ఆ చిలుకకు మనుషుల భాష అర్థం అవుతోంది. దీంతో చిలుకను చూసిన ఇన్స్పెక్టర్ కన్నయ్య దానిని విచారించటం మొదలుపెట్టారు. 'మీ సర్ అమృత్ మల్లా ఎక్కడికి వెళ్లాడు? వాళ్లు పాత్రలో మద్యం తయారు చేశారా?' అని ఇన్స్పెక్టర్ ప్రశ్నలు అడిగారు. చిలుక ఆయన మాటలు శ్రద్ధగా వినింది.
కానీ చిలుక మాత్రం తన యజమానికి విధేయురాలై తెలివిగా 'కటోరా'(తెలుగులో పాత్ర) అనే పదం తప్ప ఏం చెప్పడం లేదు. మంగళవారం అర్థరాత్రి రాత్రి జరిగిన ఈ చిలుక విచారణ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.