పాఠశాలలో జరిగిన వాగ్వాదాన్ని మనసులో పెట్టుకున్న ఓ విద్యార్థి అతన్ని చంపేందుకు స్కెచ్ వేశాడు. మరుసటి రోజు స్కూల్‌కు ఏకంగా పిస్టల్‌ను పట్టుకొచ్చి అందరిని హడలెత్తించాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని సిద్కూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
అసలేం జరిగింది:
రెండు రోజుల క్రితం సిడ్కూల్ పోలిస్ స్టేషన్ పరిధిలోని ఓ స్కూల్లో 12వ తరగతి విద్యార్థికి, పదో తరగతి విద్యార్థి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. దీంతో స్కూల్ యాజమాన్యం వారిద్దరినీ పిలిచి సర్ది చెప్పారు.
అయితే తనకు జరిగిన అవమానాన్ని మరిచిపోలేని ఆ పదో తరగతి విద్యార్థి మరుసటి రోజు పాఠశాలకు ఏకంగా ఓ పిస్టల్‌ను తెచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పిల్లాడ్ని మందలించిన టీచర్లు అతని వద్దనున్న పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.