ఒడిశా రాయగడ జిల్లాలోని కందపేంద్రగూడలో దారుణం జరిగింది. ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు కొండ మీదకు వెళ్లిన అండ్రియా జగరంగా అనే బాలుడు మృత్యువాత పడ్డాడు. ఊరిలో మొబైల్ సిగ్నల్ లేకపోవడం వల్ల బాలుడు, అతని మిత్రులు కలిసి పక్కన ఉన్న కొండమీదకు వెళ్లారు. ఈ క్రమంలో కొండపై నుంచి జారి పడిన బండరాయి ఆండ్రియా మీద పడింది.
ఆన్లైన్ క్లాసులు వింటుంటే.. బండరాయి మీద పడి... - ఆన్లైన్ క్లాసులకు పోయి చనిపోయిన విద్యార్థి
ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు కొండమీదకు వెళ్లిన ఓ విద్యార్థి బండరాయి పడి చనిపోయాడు. ఊరిలో సిగ్నల్ లేమి కారణంగా మిత్రులతో కలిసి పక్కన ఉండే కొండ మీదకు వెళ్లినట్లు మృతుడి సోదరుడు తెలిపాడు.
ఆన్లైన్ క్లాసులకని వెళ్లి.. అనంతలోకాలకు..
ఈ విషయాన్ని పక్కనున్న పిల్లలు స్థానికులకు అందజేశారు. వారు అత్యవసర సేవా సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది... బండరాయిని తొలగించి బాలుడిని స్థానికంగా ఉండే పద్మాపుర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి బరంపుర్లోని ఎంకేసీజీ మెడికల్ కళాశాల, ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోపే బాలుడు చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.
ఇదీ చూడండి:ఏమాత్రం జాలి లేకుండా బాలుడ్ని కట్టేసి కొట్టిన అల్లరిమూక
Last Updated : Aug 19, 2021, 8:50 PM IST