మహారాష్ట్ర, కేరళ సహా కర్ణాటక రాష్ట్రాల్లో రోజువారి నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అయితే.. ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 54,022 మందికి వైరస్ సోకింది.
కరోనా కేసులు
By
Published : May 7, 2021, 11:18 PM IST
మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 54,022 మంది వైరస్ బాధితులుగా మారారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 49,96,758కి చేరింది. మరో 898 మంది కొవిడ్‌కు బలయ్యారు. కొత్తగా 37 వేలకుపైగా మందికి కోలుకున్నారు.
కర్ణాటకలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 48,781 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 592 మంది ప్రాణాలు కోల్పోయారు. 28 వేలకిపైగా మందికి వైరస్ నుంచి బయటపడ్డారు.
కేరళలో రోజువారి నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 38,460 కేసులు వెలుగుచూశాయి. మరో 54 మంది చనిపోయారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో కొవిడ్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజే 28,076 మందికి వైరస్ సోకింది. మరో 372 మంది చనిపోయారు. 33 వేల మంది కొవిడ్ బారిన పడ్డారు.