Spurious Beers In Karnataka : కర్ణాటకలో కల్తీ బీర్లు కలకలం రేపాయి. రెండు ప్రముఖ కంపెనీలకు చెందిన బీర్లలో ప్రమాదకర రసాయనాలను గుర్తించారు రాష్ట్ర ఎక్సైజ్ పోలీసులు. ఈ క్రమంలో రూ.25 కోట్లు విలువైన 78,678 బీర్ బాటిళ్ల బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత కంపెనీ యజమానులపై కేసు నమోదు చేశారు.
జులై 28న మైసూర్.. నంజనగూడులో రెండు బీర్ల తయారీ కంపెనీల్లో ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తున్నారని మైసూర్ ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు.. ఆ కంపెనీలకు చెందిన బీర్ల శాంపిల్స్‌ను కొద్ది రోజుల క్రితం ల్యాబ్‌కు పంపారు. కాగా.. బీర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు నివేదిక వచ్చింది. ఈ క్రమంలో ఎక్సైజ్ అధికారులు ఆ రెండు కంపెనీలకు చెందిన బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని త్వరలోనే ధ్వంసం చేస్తామని అధికారులు తెలిపారు.
బంగారం, ఐఫోన్లు స్వాధీనం..
Iphones Seized In Amritsar Airport News : మరోవైపు.. పంజాబ్‌లోని అమృత్సర్ ఎయిర్‌పోర్టులో ఐఫోన్లు, బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వారి దగ్గర నుంచి 57 ఐఫోన్లు, 490 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరూ షార్జా నుంచి అమృత్‌సర్‌కు ఓ విమానంలో వచ్చినట్లు అధికారులు తెలిపారు.