Specially Abled Minor Girl Gangraped: రాజస్థాన్ ఆళ్వార్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. దివ్యాంగురాలైన బాలికపై సామూహిక అత్యాచారం చేసి, అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు దుండగులు. ఈ దారుణ ఘటన మంగళవారం రాత్రి జరిగిందని పోలీసులు తెలిపారు.
పదునైన వస్తువులతో గాయపరిచి..
Minor Girl Gangraped: మలఖేడ్ గ్రామంలోని కల్వర్టు సమీపంలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలికను గుర్తించారు గ్రామస్థులు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండగా.. మెరుగైన వైద్యం కోసం జైపుర్‌కు తరలించారు.
'బాలిక తప్పిపోయిందని మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఫిర్యాదు వచ్చింది. ఆ తల్లిదండ్రులకు విషయం చెప్పి, పిలిపించాము. అత్యాచార బాధితురాలు తమ బాలికేనని గుర్తించారు. దుండగులు బాధితురాలిని పదునైన వస్తువులతో తీవ్రంగా గాయపరిచారు.' అని జిల్లా ఎస్పీ తేజశ్విని గౌతమ్ చెప్పారు. నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.