తెలంగాణ

telangana

ETV Bharat / bharat

2-డీజీ ఔషధం భారీ ఉత్పత్తికి సన్నాహాలు! - డీఆర్​డీఓ కరోనా మందు

డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ కొవిడ్‌ ఔషధం.. ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ ఔషధాల తయారీకి మరో మూడు, నాలుగు సంస్థలకు అనుమతివ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా చికిత్సలో 2-డీజీ సత్ఫలితాలిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని చెప్పాయి.

rajnath singh, harsha vardhan
2-డీజీ ఔషధం

By

Published : May 22, 2021, 7:44 AM IST

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన 2-డీజీ కొవిడ్‌ ఔషధం.. కరోనా చికిత్సలో సత్ఫలితాలిస్తున్న వేళ.. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వాటి ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. 2-డీజీ ఔషధాల తయారీకి మరో మూడు, నాలుగు సంస్థలకు అనుమతివ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2-డీజీ ఔషధంపై కొవిడ్‌ బాధితులు, వారి కుటుంబసభ్యుల నుంచి సానుకూలత వ్యక్తమవుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, వీటి వినియోగానికి అనుమతి ఉన్నప్పటికీ కొరత కారణంగా వాటిని పొందలేకపోతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు కేవలం పదివేల 2-డీజీ ఔషధాలను మాత్రమే తయారీ సంస్థలు సరఫరా చేయడం వల్ల వాటి ఉత్పత్తి మరింత పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పొడి రూపంలో ఉండే 2-డియాక్సీ-డి-గ్లూకోజ్‌ (2-డీజీ) ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని 'ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌' (ఇన్‌మాస్‌) అభివృద్ధి చేసింది. ఆక్సిజన్‌ అవసరమైన కొవిడ్‌ బాధితులు త్వరగా కోలుకునేలా ఈ ఔషధం పనిచేస్తున్నట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్‌ రూపంలో ఉన్న ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) ఇటీవల అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చింది. కొవిడ్‌ మహమ్మారిపై యావత్‌ దేశం పోరాటం చేస్తున్న వేళ.. కొత్త ఆశాకిరణంలా 2-డీజీ ఔషధాన్ని డీఆర్‌డీవో అందుబాటులోకి తీసుకొచ్చిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details