జీవితాంతం కుటుంబం కోసం శ్రమించిన తండ్రిని.. వృద్ధాప్యంలో ఆశ్రమాల్లో వదిలిపెడుతున్న కుమారుల్ని చూస్తున్నాం. ప్రస్తుత రోజుల్లో ఈ ట్రెండ్ మరింత ఎక్కువైంది. ఆస్తి కోసం తండ్రినే చంపుతున్న కిరాతుకుల్నీ చూస్తున్నాం. కానీ, గుడిలో పూజారిగా చేస్తూ ఇతరులకి అండగా నిలిచిన తన తండ్రి జ్ఞాపకార్ధంగా.. గుడి కట్టిన కుమారుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకి చెందిన నలుగురు కుమారులు క్రిష్ణప్ప, బెట్టదప్ప, హనుమంతప్ప, నాగరాజ్లకు వారి తండ్రి అంటే చాలా ఇష్టం. కూకనపల్లి గ్రామ గుడిలో పూజారిగా పనిచేసిన వారి తండ్రి తిమ్మన్న.. ఇతరులకు సహాయం చేస్తూ జీవించేవారని చెబుతున్నారు. ఆయన చివరి రోజుల వరకు ఎంతో బాగా చూసుకున్నామని అంటున్నారు. తిమ్మన్న పూజారి 2005లోనే మృతి చెందారు. అప్పుడే.. తమ తండ్రి జ్ఞాపకార్థం గుడి కట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ.. ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడం వలన నిర్మించలేక పోయామని తెలిపారు.