తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ధరల పెరుగుదలపై కాంగ్రెస్​ పోరుబాట- భారీ ర్యాలీకి ఏర్పాట్లు

ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ డిసెంబర్​ 12న దిల్లీలో భారీ ర్యాలీకి ఏర్పాట్లు(congress rally against inflation) చేస్తోంది కాంగ్రెస్​. ధరల పెరుగుదలతో ఎదురువుతున్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకొచ్చి కేంద్రాన్ని ఇరుకునపెట్టేందుకు నడుంబిగించింది. మరోవైపు.. పార్లమెంట్​ శీతాకాల సమావేశల(parliament session) తొలిరోజున విపక్షాల సమావేశానికి పిలుపునిచ్చింది. తమ పార్టీ ఎంపీలకు విప్​ జారీ చేసింది.

Congress rally against price rise
ధరల పెరుగుదలపై కాంగ్రెస్​ పోరుబాట

By

Published : Nov 26, 2021, 8:23 PM IST

దేశంలో పెరిగిపోతున్న ధరలు(price rise in india), ద్రవ్యోల్బణానికి(inflation news) వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్(Congress news)​. పెరుగుతున్న ధరలను నిరసిస్తూ.. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు డిసెంబర్​ 12న దిల్లీలో భారీ బహిరంగ సభ(congress rally against inflation) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ర్యాలీలో భాగంగా ధరల పెరుగుదలపై కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Congress president Sonia Gandhi), రాహుల్​ గాంధీ మాట్లాడతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ తెలిపారు.

"డిసెంబర్​ 12న దిల్లీలో నిర్వహించే భారీ ర్యాలీ ద్వారా ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షులు రాహుల్​ గాంధీ, ఇతర కీలక నేతలు ఈ ర్యాలీలో మాట్లాడతారు. ఈ సభ ద్వారా వెన్ను విరుస్తోన్న ధరలను తగ్గించాలని, ప్రజలను దోచుకోవటం అపాలని మోదీ ప్రభుత్వానికి హెచ్చరిక చేయనున్నాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు మా ఆందోళనలు కొనసాగుతాయి. మోదీ, ద్రవ్యోల్బణం ప్రజలకు శాపంగా మారాయి. దేశంలోని ప్రతి కుటుంబ బడ్జెట్​ను ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తారుమారు చేసింది."

- కేసీ వేణుగోపాల్​, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి.

ప్రజలు పడుతున్న బాధలను మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు కాంగ్రెస్​ నేత(Congress news). కొన్ని మీడియాల బలంతో మతాల మధ్య చిచ్చుపెట్టేలా మోదీ ప్రభుత్వం ప్రవర్తిస్తోందన్నారు. దాని ద్వారా ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోందని గుర్తు చేశారు.

విపక్షాల భేటీకి కాంగ్రెస్​ పిలుపు

పార్లమెంట్​ శీతాకాల సమావేశాల(parliament winter sessions) ప్రారంభం రోజున వివిధ పార్టీలకు చెందిన విపక్ష నేతలు దిల్లీలో సమావేశం కానున్నారు. పార్లమెంట్​లో ఏకతాటిపై ఉండటం, ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. లోక్​సభ, రాజ్యసభలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు లేఖ రాశారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్​ ఖర్గే. ఈనెల 29న ఉదయం 9.45 గంటలకు జరిగే సమావేశానికి హాజరుకావాలని కోరారు. కీలకమైన అంశాలను పార్లమెంట్​లో లేవనెత్తేందుకు ఈ భేటీ ఉపయోగపడుతుందని సూచించారు. వర్షకాల సమావేశాల్లో మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

విప్​ జారీ చేసిన కాంగ్రెస్​

ఈనెల 29న పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు(parliament winter session 2021) ప్రారంభమవుతున్న క్రమంలో తొలిరోజు ఉభయ సభలకు తప్పనిసరిగా హాజరు కావాలని తమ పార్టీ ఎంపీలకు విప్​ జారీ చేసింది కాంగ్రెస్​. అదే రోజు సాగు చట్టాల రద్దు బిల్లు సభల ముందుకు వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:కనీస మద్దతు ధరపై చట్టం తేవాల్సిందే: టికాయిత్​

ABOUT THE AUTHOR

...view details