తమిళనాడు తిరుప్పుర్ జిల్లాలోని ఈశ్వరమూర్తి అనే రైస్ మిల్ యజమాని కుమారుడు శివప్రసాద్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రూ. 3 కోట్లు చెల్లించి విడిపించుకోవాలని బెదిరించారు. దీనిపై పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా.. అడిగిన మొత్తాన్ని ఇచ్చి కొడుకును విడిపించుకున్నారు ఈశ్వర మూర్తి.
ఇదీ జరిగింది..
తమిళనాడు కంగేయంలోని గౌండన్పాళెంకు చెందిన ఈశ్వరమూర్తి కుమారుడు శివ ప్రదీప్(25)ను గుర్తు తెలియని వ్యక్తులు ఆగస్టు 22వ తేదీన కిడ్నాప్ చేశారు. రూ. మూడు కోట్లు ఇస్తేకానీ ప్రదీప్‌ను విడిచి పెట్టమని తేల్చి చెప్పారు. పోలీసులకు చెప్పకూడదని బెదిరించారు. దీంతో అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కిడ్నాపర్లు అడిగిన మొత్తాన్ని చెల్లించారు. దీంతో ప్రదీప్‌ను మదురై సమీపంలో విడిచిపెట్టి వెళ్లింది ఆ ముఠా.
పోలీసుల అదుపులో నిందితులు అనంతరం పోలీసులకు సమాచారం అందించారు ఈశ్వరమూర్తి. జిల్లా ఎస్పీ కుమారేశన్ ఆదేశాల మేరకు 8 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ముఠాలో పది మంది సభ్యులు ఉండగా వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ. కోటీ 89 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:'చికెన్ ఫ్రై' బాగా వండలేదని భార్యను చంపేశాడు!