Solar Traffic Umbrellas: ఎండ వేడిమి నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేందుకు కేరళ ప్రభుత్వం ఒక పరిష్కారాన్ని కనుగొంది. రోడ్డుపై గంటలు గంటలు నిల్చొని విధులు నిర్వర్తించే వారి బాధలు అర్థం చేసుకొని సోలార్ ట్రాఫిక్ గొడుగులు అందిస్తోంది.
ఈ గొడుగు లోపల సౌరశక్తి ఆధారంగా పనిచేసే ఒక ఫ్యాన్ ఉంటుంది. మంచినీటి బాటిల్ పెట్టుకొనేందుకు వీలుగా ఒక స్టాండ్ కూడా అమర్చారు. గొడుగు పైభాగాన సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు.
Solar Umbrella for Traffic Police in Kochi: గొడుగు కింది భాగంలో బ్యాటరీని ఉంచారు. ప్రస్తుతం కొచ్చి జిల్లా ఎర్నాకుళం నగరంలో ఇలాంటి ఐదు గొడుగులు ఏర్పాటు చేసింది కేరళ పోలీసు విభాగం.
గొడుగు కింద కూర్చునేందుకు సీటు, వెలుతురు కోసం లైట్ ఏర్పాటు చేసే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో ఎప్పుడూ నిల్చొనే పనిచేసే ట్రాఫిక్ పోలీసులు కొంతసేపు కూర్చునే వీలుంటుంది.
ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే.. ఇతర జిల్లాలకు కూడా విస్తరించనున్నట్లు పోలీసులు తెలిపారు.