Reels on Tomato Price Hike 2023 :రాష్ట్రంలో టమాట ధర పెరుగుదల సామాన్యులపై చాలా ప్రభావం చూపుతోంది. దొంగతనాలు చేసినప్పుడు దొంగలు బంగారం, డబ్బుతో పాటు నాలుగు టమాటలు కూడా తీసుకెళ్తే మనకు ఖర్చు తగ్గుతుంది కదా అని దొంగలు కూడా ఆలోచిస్తున్నారంటే.. టమాటలకు ప్రస్తుతం ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటిదాకా పది, ఇరవై రుపాయలకు కిలో ఉన్న టమాటఇప్పుడు రూ.120 నుంచి రూ.250 పలుకుతోంది. ఈ ధరలు చూసి సామాన్య ప్రజలు హడలెత్తి పోతున్నారు. అయితే సమాజంలో ఏది జరిగినా.. దాన్ని ఫన్‌గా తీసుకుని మీమ్స్, రీల్స్, షాట్స్ చేయడం సోషల్ మీడియా యూజర్స్‌కు బాగా అలవాటైపోయింది. ఇక ఈ టమాట ధరల పెరుగుదలతో జరుగుతున్న వివిధ రకాల సంఘటనలను చూసి వీళ్లు ఊరుకుంటారా..? అందుకే టమాట ధరల పెరుగుదలపై రకరకాల రీల్స్, షాట్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. అలా టమాటాలపై సోషల్ మీడియాలో సందడి చేస్తున్న కొన్ని వీడియోలు మీకోసం.
Tomato Price Hike 2023 :ఒక వీడియోలో చెల్లి ఆన్‌లైన్‌లో సేల్ నడుస్తుంది డబ్బులు ఇవ్వమని తన అన్నను అడుగుతుంది. దానికి వాళ్ల అన్నయ్య కళ్లు మూసుకో అని చెప్పి తన చేతిలో నాలుగు టమాటలు పెడతాడు. ఏంటి అన్న ఇది అంటే.. ఆ అన్న ఓ థియరీ చెబుతాడు. ఆ థియరీకి కన్విన్స్ అయిన ఆ అమ్మాయి తన సోదరుడు చెప్పింది ఒప్పుకుని తను ఇచ్చిన టమాటలకో షాపింగ్ చెయ్యడానికి సిద్ధమవుతుంది. ఇంకా క్లియర్‌గా తెలియాలంటే.. ఓసారి ఈ వీడియో చూసేయండి.
ఏదీ కొన్నా టమాటనే ఇస్తా : ఇక మనం ఈ మధ్య కాలంలో ఏది కొన్నా ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తున్నాం. ఆఖరికి పది రుపాయల చాయ్ కొన్నా ఐదు రుపాయల చాక్లెట్ కొన్నా ఏ ఫోన్ పే నో, గూగుల్ పే నో ఉపయోగిస్తున్నాం. కానీ ఇప్పుడు కొంత మంది ఏం చేస్తున్నారంటే పెరిగిన టమాట ధర దృష్ట్యా ఏదీ కొన్నా టమాటాలను బదులుగా ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టమాటల విలువ చాలా ఎక్కువ కాబట్టి. దీనికి సంబంధించిన ఒక వీడియో యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతుంది. ఓసారి మీరూ చూసేయండి మరి.