తెలంగాణ

telangana

హిమాచల్​లో ఆకట్టుకుంటున్న మంచు అందాలు.. పర్యటకుల కేరింతలు..!

By

Published : Jan 18, 2023, 7:17 AM IST

హిమాచల్​ ప్రదేశ్​ను చలి వణికిస్తోంది. రాజధాని శిమ్లాను మంచు దుప్పటి కప్పేసింది. అలాగే పక్కనే ఉన్న కుఫ్రీ హిల్​ స్టేషన్​లో మంచు అందాలు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మంచు కొండ ప్రాంతానికి పర్యటకుల తాకిడి పెరిగింది. దీంతో కుఫ్రీ ప్రాంతం పర్యటకులతో సందడిగా మారింది.

Himachal Simhla Snowfall Kurfi
Himachal Simhla Snowfall

హిమాచల్​లో మంచు అందాలు

హిమాచల్ ప్రదేశ్‌ను మంచు దుప్పటి కప్పేసింది. శిమ్లా నగరానికి కూతవేటు దూరంలో ఉన్న పర్యాటక ప్రదేశం కుఫ్రీలో హిమపాతం కనువిందు చేస్తోంది. కుఫ్రీ శ్వేతవర్ణంలో మెరిసిపోతోంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బయటి రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పర్యటకుల శిమ్లాకు పోటెత్తారు.

"శిమ్లాలో మొదటిసారి మంచు కురుస్తోందని​ వార్తల్లో తెలుసుకొని వచ్చాం. ఇక ఆలస్యం చేయకుండా కష్టమైనా సరే పిల్లలను కూడా వెంట తీసుకొని వచ్చాం. చెప్పాలంటే మంచు అందాలని ఆస్వాదించడం నాకు ఇదే మొదటి సారి. నేచర్ వ్యూ చాలా అందంగా ఉంది. ఇక్కడి వారందరు చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. చాలా ఎంజాయ్​ చేస్తున్నాం. అలాగే సంతోషంగా కూడా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆహారం కూడా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ శిమ్లా చాయ్​ బాగుంది. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. అందరు చాలా ఎంజాయ్​ చేస్తున్నారు."

-పర్యటకురాలు

మంచును చూసేందుకు పర్యటకులు భారీగా శిమ్లాకు చేరుకుంటున్నారు. హిమపాతంలో చాలా సరదాగా గడుపుతున్నారు. మంచు వర్షంలో గుర్రపు స్వారీతో పాటు ట్రెక్కింగ్​ చేస్తూ ఆనందిస్తున్నారు టూరిస్టులు. హిమపాతాన్ని చూసి ఎంతో సంతోషిస్తున్నామని ఇక్కడి వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని పర్యటకులు చెబుతున్నారు. ఇక్కడ దొరికే ఆహారం కూడా బాగుంటుందని తెలిపారు.

కుఫ్రీలో పర్యటకుల సందడి
కుఫ్రీలో పర్యటకుల సందడి

"గొప్ప అనుభూతి కలుగుతోంది. ఈ సీజన్​లో ఫస్ట్​ టైమ్​ స్నోఫాల్​ను ఆస్వాదిస్తున్నాం. ప్రత్యేకంగా స్నోఫాల్​ చూడటానికే వచ్చాం. కాకపోతే ప్రతిసారి డిసెంబర్​ నెలలో కురిసే మంచు ఈసారి కాస్త ఆలస్యంగా కురిసింది. మంచు అందాలు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తోంది. ముఖ్యంగా స్నో ట్రెక్కింగ్​ అయితే బాగా ఎంజాయ్​ చేశాను. ఇలాంటి మంచు అందాలను ఆస్వాదించటానికి ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాలకు రావాలి. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది."

-పర్యటకురాలు

"చాలా మంచి ఎక్స్​పిరియన్స్​ కలిగింది. వాతావరణ పరిస్థితులను బట్టి మేము ఇక్కడికి రావటానికి ప్లాన్​ చేసుకున్నాం. నిరంతరాయంగా మంచు కురవటం చాలా బాగా అనిపిస్తోంది. మేము ఏదైతే ఊహించామో ఆ సంతోషాన్ని ఇక్కడ పొందుతున్నాము. మా ఇళ్ల దగ్గర ఎప్పుడూ ఎండలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ అస్సలు మంచు కురిసే అవకాశమే ఉండదు. కాబట్టి అటువంటి అందాలు వీక్షించటానికి ఇటువంటి మంచు ప్రదేశాలకు వస్తుంటాము. కుటుంబంతో చాలా ఎంజాయ్​ చేస్తున్నాను. అయితే ఇంటికి వెళ్లాక ఎవరైతే మంచి ఔటింగ్​కు వెళ్లాలనుకుంటున్నారో వారికి ఈ సీజన్​లో కుఫ్రీ హిల్​ స్టేషన్​ను సందర్శించమని సూచిస్తాను."

-పర్యటకుడు

హిమాచల్​లో ఈ ఏడాది హిమపాతం కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఎట్టకేలకు మంచు కురుస్తుండటం వల్ల పర్యాటక ప్రదేశాలు టూరిస్టులతో మరింత సుందరంగా మారాయి. మీరు కూడా మంచు సోయగాలను చూడాలనుకుంటే హిమాచల్‌ను సందర్శించడానికి ప్లాన్ చేసుకొండి మరి.

కుఫ్రీలో పర్యటకుల సందడి

ABOUT THE AUTHOR

...view details