తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండున్నర కేజీల పాము విషం.. ఫ్రాన్స్ నుంచి చైనాకు స్మగ్లింగ్.. విలువ రూ.30 కోట్లు - snake venom smuggling

పాము విషాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అటవీ అధికారులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రెండున్నర కేజీల విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో భారీగా ఉంటుందని అధికారులు తెలిపారు.

Snake Venom worth Rs 30 crore seized
Snake Venom worth Rs 30 crore seized

By

Published : Oct 16, 2022, 10:27 PM IST

బంగాల్ డార్జీలింగ్​లోని ఘోష్​పుకొర్ ప్రాంతంలో అధికారులు భారీ ఎత్తున సర్పాల విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఫన్సిడేవా ప్రాంతంలో సోదాలు జరిపిన అటవీ అధికారులు శనివారం రాత్రి రెండున్నర కేజీల విషాన్ని గుర్తించారు. ఈ విషాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

విషం సీసాపై ఫ్రాన్స్ లేబుల్​

నిందితుడిని మహమ్మద్ సరాఫత్​గా గుర్తించినట్లు అటవీశాఖ వర్గాలు తెలిపాయి. ఉత్తర దినాజ్​పుర్ జిల్లాలోని ఖురాయి ప్రాంతంలో ఇతడు నివసిస్తున్నట్లు వెల్లడించాయి. 'సీసాలో నింపిన పాము విషాన్ని ద్విచక్రవాహనంపై ఓ వ్యక్తి తీసుకెళ్తున్నాడు. ఘోష్​పుకొర్ ప్రాంతంలో జాతీయ రహదారిపై మేం నిఘా పెట్టాం. ఈ దారిలో నిందితుడు వెళ్తుండగా పట్టుకున్నాం. అనంతరం అరెస్టు చేశాం. అతడి వద్ద నుంచి భారీ ఎత్తున పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నాం' అని అటవీ శాఖ వర్గాలు వివరించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పాము విషం రూ.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

నిందితుడితో అధికారులు

'నిందితుడిని విచారించగా.. పాము విషం ఫ్రాన్స్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా భారత్​లోకి వచ్చిందని చెప్పాడు. ఈ విషాన్ని అతడు నేపాల్​కు తీసుకెళ్తున్నట్లు వివరించాడు. నేపాల్ నుంచి చైనాకు తీసుకెళ్లాలన్నది అసలు ప్లాన్. అయితే, సరైన సమయంలో సమాచారం అందడం వల్ల స్మగ్లింగ్ గుట్టురట్టైంది. దీని వెనక అంతర్జాతీయ ముఠాల హస్తం ఏదైనా ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టాం' అని అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details