రాజస్థాన్లోని పుష్కర్లో ఓ అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 23 ఏళ్ల యువకుడు. ఈ సమాచారం అందిన వెంటనే నిందితుడిని అరెస్టు చేసినట్లు అజ్మేర్ ఎస్పీ జగ్దీష్ చంద్ర శర్మ తెలిపారు. పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
20 మంది అరెస్టు..
రాజస్థాన్లోని జలావర్ ప్రాంతంలో ఓ మైనర్పై అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలో 20 మందిని అరెస్టు చేశారు పోలీసులు.