ఒకే ఇంట్లో ఆరుగురు విగతజీవులుగా కనిపించడం కలకలం రేపింది. జమ్మూలోని సిధ్రా ప్రాంతంలోని బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలు, ఆస్పత్రికి తరలించారు.
మృతులను సకీనా బేగమ్, ఆమె ఇద్దరు కూతుళ్లు రుబీనా బనో, నసీమా అక్తర్, కుమారుడు జాఫర్ సలీం, మరో ఇద్దరు బంధువులు నూర్ ఉల్ హబీబ్, సాజిద్ అహ్మద్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ అనుమానస్పద మరణాలకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు.
ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు, ఏం జరిగింది - ఆరుగురు మృతి
Six people were found dead in a single house in Sudra area of Jammu this morning
08:21 August 17
ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు, ఏం జరిగింది
ఒకే కుటుంబంలో ఐదుగురు..మహారాష్ట్ర పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి అహ్మద్‌నగర్-పుణె జాతీయ రహదారిపై రాజ్‌నందగావ్ వద్ద ఓ కారు.. రాంగ్ రూట్లో వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
ఇవీ చూడండి:గుజరాత్‌లో డ్రగ్స్ కలకలం, రూ.2వేల కోట్ల మత్తుపదార్థాలు సీజ్
Last Updated : Aug 17, 2022, 9:31 AM IST