మహారాష్ట్ర హింగోలీలోని కపడసింగి గ్రామంలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఆరు నెలల చిన్నారిని దేవతగా భావించి పూజలు చేస్తున్నారు భక్తులు. స్థానికంగా ఉండే భక్తులతో పాటు విదేశాల నుంచి శిశువు చూసేందుకు తరలివస్తున్నారు.
ఆరు నెలల క్రితం కపడసింగి తండాలో సుభాశ్ అనే వ్యక్తికి జన్మించిన బాలిక నుదుటి భాగంలో ఎరుపు, పసుపు రంగు మచ్చలు ఉండేవి. అవి వయసుతోపాటే పెరిగి.. కుంకుమ రంగులోకి మారిపోయాయి. ప్రస్తుతం చిన్నారి నుదిటి మొత్తం కుంకుమ రంగు వ్యాపించడం వల్ల.. ఆ పాపను అమ్మవారిగా భావించి పూజలు చేయడం మొదలుపెట్టారు భక్తులు. చిన్నారిని చూసేందుకు మహిళా భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఆరు నెలల చిన్నారికి పూజలు.. దర్శనం కోసం వందలాది మంది క్యూ.. ఆ మచ్చలే కారణం - మహారాష్ట్ర హింగోలీ న్యూస్
ఆధునిక యుగంలోనూ అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. ఆరు నెలల చిన్నారి నుదిటిపై కుంకుమ రంగులో ఉన్న మచ్చలు పెరగడం వల్ల.. శిశువును దేవతగా భావించి పూజలు చేస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
ఆరు నెలల బాలికను దేవతగా భావించి పూజలు