ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర థానేలోని ఓ ప్రైవేట్ కొవిడ్ ఆసుపత్రిలో కరోనా సోకిన నలుగురు సరైన సమయానికి ఆక్సిజన్ అందక కన్నుమూశారు. బర్షీలోని మరో ఆసుపత్రిలో ఇద్దరు చనిపోయారు.
ఆక్సిజన్ కొరతతో ఆరుగురు రోగులు మృతి
ఆక్సిజన్ కొరతతో మహారాష్ట్రలోని థానేలో నలుగురు మరణించారు. మరోవైపు బర్షీలోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఇద్దరు మరణించారు.
ఆక్సిజన్ కొరతతో మహా ఆరుగురు మృతి
ఆసుపత్రి వర్గాల బాధ్యతారాహిత్యం కారణంగానే రోగులు చనిపోయనట్లు మృతుల బంధువులు ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఆసుపత్రి యాజమాన్యాలు ఆరోపణలను తిప్పికొడుతున్నాయి. చనిపోయినవారు అనారోగ్యంతో వయసు కారణంగా మరణించారని తెలిపారు.