Siblings Run Over by Train: రాజస్థాన్, జైపుర్‌లో విషాదఘటన జరిగింది. పట్టాలపై పబ్జీ ఆడుతూ ఇద్దరు తోబుట్టువులు రైలు కిందపడి చనిపోయారు. అల్వార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది..
Siblings Run Over by Train: రాజస్థాన్, జైపుర్‌లో విషాదఘటన జరిగింది. పట్టాలపై పబ్జీ ఆడుతూ ఇద్దరు తోబుట్టువులు రైలు కిందపడి చనిపోయారు. అల్వార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది..
'లోకేశ్ మీనా(22), రాహుల్(19) రూప్బాస్ పట్టణంలో వారి అక్క ఇంటి దగ్గరే ఉండి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. వారి తండ్రి జిల్లాలోని తెల్హా గ్రామంలో నివసిస్తున్నారు. సోదరులు ఖాలీ సమయంలో పబ్జీ ఆడుతూ కాలక్షేపం చేసేవారు. ఈ క్రమంలో రూప్బాస్ పట్టణం సమీపంలోని రైలు పట్టాలపై కూర్చొని ఫోన్లో పబ్జీ ఆటలో నిమగ్నమయ్యారు. ఇంతలో ఆ మార్గంలో రైలు వచ్చింది. ట్రైన్‌ను గమనించని అన్నదమ్ములు అలాగే ఆటలో పూర్తిగా లీనమయ్యారు. దీంతో రైలు వారిని ఢీకొట్టింది' అని ఎస్ఐ మనోహర్ లాల్ తెలిపారు.
ఇదీ చదవండి:Cab Drivers Murdered: రూ.600 కోసం ఇద్దరు క్యాబ్ డ్రైవర్ల హత్య