రెస్టారెంట్లోకి ప్రవేశించి.. సిబ్బందిని, కస్టమర్లను కొట్టిన సబ్ ఇన్స్పెక్టర్ను అధికారులు బదిలీ చేశారు. ఎస్సై దౌర్జన్యం తాలూకు దృశ్యాలు వైరల్ కావడం వల్ల ఈ చర్యలు తీసుకున్నారు.
ఏం జరిగిందంటే?
తమిళనాడు కోయంబత్తూర్లోని కట్టూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్సై.. ఆదివారం రాత్రి 10.20 గంటలకు ఓ రెస్టారెంట్లోకి వెళ్లాడు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న నెపంతో అక్కడి కస్టమర్లు, సిబ్బందిని లాఠీతో కొట్టాడు. ఆ సమయంలో హోటల్లో ఉన్న ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
రెస్టారెంట్ సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు లంచం కోసం!
దీనిపై రెస్టారెంట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఎస్సై ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చి రెస్టారెంట్ మూసేయాలని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాత్రి 11 గంటల వరకు రెస్టారెంట్ కార్యకలాపాలు కొనసాగొచ్చని చెప్పారు. ఎస్సై కొన్నిసార్లు లంచం డిమాండ్ చేశాడని వివరించారు. రెస్టారెంట్లో భోజనం చేసి డబ్బులు కూడా చెల్లించలేదని చెప్పారు. డబ్బులు అడిగితే బెదిరించేవాడని అన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తునకు ఆదేశించారు దేవసిర్వతం పోలీస్ కమిషనర్ డేవిడ్సన్. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సైని పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ చేశారు.
మరోవైపు, ఈ ఘటనపై రెండు వారాల్లోగా నివేదిక అందించాలని తమిళనాడు రాష్ట్ర మానవహక్కుల సంఘం సీపీని ఆదేశించింది.
ఇదీ చదవండి:వచ్చే ఐదు రోజులు వర్షాలే వర్షాలు!