పుణెకు చెందిన సీరం సంస్థలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ఈ ఘటనపై అనుమానాలకు తెరదించుతూ ఇది కేవలం ప్రమాదమే అని స్పష్టం చేశారు. ఈ విషయాలను శుక్రవారం జరిగిన జిల్లా అధికారుల సమావేశం సందర్భంగా మీడియాకు తెలిపారు.
"ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పని జరుగుతోంది. సంస్థ ఆడిట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూటే కారణం."