జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. షోపియాన్ జిల్లా రావల్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు శనివారం సాయంత్రం నిర్బంధ తనిఖీలు చేపట్టాయి.
కశ్మీర్లో ఎన్కౌంటర్- ఓ ఉగ్రవాది హతం - కశ్మీర్లో ఎదురుకాల్పులు
జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలకు, ముష్కరులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు.
కశ్మీర్లో ఎన్కౌంటర్- ఓ ఉగ్రవాది హతం
ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ఆదివారం ఉదయం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:ఝార్ఖండ్లో పది మంది నక్సల్స్ అరెస్ట్