Kerala Biker video: బైక్‌పై హాయిగా వెళ్తున్న ఇద్దరు యువకులను బండరాయి రూపంలో వెంటాడింది మృత్యువు. భారీ పరిమాణంలో ఉన్న ఆ రాయి కొండపై నుంచి వేగంగా జారుకుంటూ వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు ఎగిరి రోడ్డుపక్కన పొదల్లో పడ్డారు. ఈ ఘటనలో మలప్పురానికి చెందిన బైక్ రైడర్ అభినవ్(20) అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకాల కూర్చున్న మరో యువకుడు అనీశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రితో మృత్యువుతో పోరాడుతున్నాడు.
దూసుకొచ్చిన బండరాయి .. క్షణాల్లో గాల్లో కలిసిన బైకర్ ప్రాణాలు - వైరల్ వీడియో
కేరళ కోజికోడ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. బైక్‌పై వెళ్తున్న యువకులను భారీ బండరాయి డీకొట్టింది. దీంతో వారు గాల్లో ఎగిరి రోడ్డు పక్కన పొదల్లో పడ్డారు. ఈ దుర్ఘటనలో బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కేరళ వయనాడ్ ఘాట్ రోడ్డులో ఏప్రిల్ 16న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రమాదానికి గురైన బైక్ వెనకాల వస్తున్న మరో బైకర్ దీన్ని కెమెరాలో బంధించాడు. వయనాడ్ జిల్లాను కేరళలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే ఏకైక రహదారి వయనాడ్ ఘాట్ రోడ్డులోని ఆరో హెయిర్‌పిన్ వంపులో ఈ ప్రమాదం జరిగింది. ఈ రహదారిని ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. వారంతా ఈ వీడియో చూసి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకూ ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అని హడలెత్తిపోతున్నారు.
ఇదీ చూడండి:75ఏళ్ల వయసులో కరాటే.. రెండో ర్యాంక్ బ్లాక్ బెల్ట్ కైవసం