రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి అరెస్ట్ వ్యవహారంపై భాజపా-శివసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా.. భాజపా లక్ష్యంగా తన అధికార పత్రిక సామ్నాలో విమర్శనాస్త్రాలు సంధించింది శివసేన. అర్నబ్ అరెస్ట్ చుట్టూ నెలకొన్న హడావుడిని అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో పోల్చింది.
"ఎన్నికల ఫలితాలపై ట్రంప్ అసత్య వార్తలను వ్యాపింపజేస్తున్నారు. ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా ప్రతిష్ఠను పట్టించుకోకుండా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ట్రంప్ లాగే మహారాష్ట్రలో భాజపా నేతలు ప్రవర్తిస్తున్నారు. ఓ అత్మహత్య కేసులో నిందితుడి అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరనసలు చేస్తున్నారు."