ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని 'హర్ కీ పౌరి' ఘాట్‌లో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. 'షాహి స్నాన్'గా అభివర్ణించే ఈ పవిత్ర స్నానాల కోసం భక్తకోటి తరలివచ్చింది.
శివరాత్రి వేళ హరిద్వార్‌లో 'షాహి స్నాన్' - 'షాహి స్నాన్'
మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉత్తరాఖండ్ స్నానాల ఘాట్లు శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చిన భక్తకోటితో హరిద్వార్ వీధులు పులకించాయి.
శివరాత్రి స్పెషల్: హర్ కీ పౌర్ ఘాట్‌లో 'షాహి స్నాన్' ఆరంభం
మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయానికి భక్తులను అనుమతించట్లేదు. ముంబయిలోని బాబుల్నాథ్ ఆలయం సైతం భక్తులను అనుమతి లేదని ప్రకటించింది.