వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంజాబ్‌లో రాజకీయ సమీకరణలు వేగంగా మారనున్నాయి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గతేడాది ఎన్డీయేతో.. తెగదెంపులు చేసుకున్న అకాలీదళ్ పంజాబ్‌లో మళ్లీ అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో బీఎస్పీతో జట్టు కట్టింది. ఈ మేరకు అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఓ ప్రకటన చేశారు.
పంజాబ్‌లో దాదాపు 27ఏళ్ల తర్వాత అకాలీదళ్-బీఎస్పీ ఎన్నికల్లో మళ్లీ కలిసి పోటీ చేయనున్నాయి. భాజపాతో తెగదెంపుల వల్ల కొన్నిచోట్ల ఏర్పడిన ఖాళీని బీఎస్పీతో భర్తీ చేయాలని బాదల్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.