శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు కరోనా సోకింది. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రొటోకాల్‌లో భాగంగా నేను ఐసోలేషన్‌లో ఉంటున్నాను. గత కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారంతా కొవిడ్ పరీక్ష చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.