బంగాల్‌ను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకే భాజపా పోరాడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మమతా బెనర్జీ సర్కార్‌ను ఓడించి భాజపాను అధికారంలోకి తేవడం తమ లక్ష్యం కాదని, ఇక్కడి పరిస్థితుల్లో మార్పు తేవడమే లక్ష్యమన్నారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నవేళ రెండు రోజుల పర్యటన నిమిత్తం బంగాల్‌కు వచ్చిన అమిత్ షా.. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కాక్ద్విప్లో గురువారం ఐదో విడత పరివర్తన్ ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం ప్రయోజనాలు కల్పిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
భాజపా ప్రభుత్వమే..
బంగాల్ ఎన్నికల్లో పోరాటం తమ పార్టీ బూత్ కార్యకర్తలు, తృణమూల్ కాంగ్రెస్ సిండికేట్ల మధ్యేనన్నారు. రాబోయే ఎన్నికల్లో బంగాల్లో భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చాక ఏటా లక్షలాది మంది యాత్రికులు వచ్చే గంగాసాగర్ మేళాను అంతర్జాతీయ టూరిస్ట్ సర్క్యూట్‌గా మారుస్తామన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని రకాల పర్యాటక ప్రాజెక్టులను ఇక్కడ విజయవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
అవినీతిపై దర్యాప్తు చేస్తాం..