కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్ఖిహోళితో పాటు అసభ్యకర వీడియోలో ఉన్నట్లు భావిస్తున్న మహిళ తండ్రి.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
పరిస్థితులు, రాజీకీయాల వల్ల తన కుమార్తె బాధితురాలిగా మారిపోయిందని, ఆమె అసభ్యకర వీడియో.. అన్ని మీడియాలో ప్రసారమైందని మహిళ తండ్రి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన కుమార్తెకు తెలియజేసేందుకు మాత్రమే ఆమెను తాను సంప్రదించానని చెప్పారు. సీఆర్పీసీ 164వ సెక్షన్లోని నిబంధనలను గాలికి వదిలేసి తన కుమార్తె వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారని పిటిషన్లో ఆయన ఆరోపించారు.