కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ (71).. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు ఫైజల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడి.. పలు అవయవాలు దెబ్బతిన్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు ఫైజల్ పటేల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్
71 ఏళ్ల పటేల్ తాను కొవిడ్ బారిన పడినట్లు అక్టోబర్ 1న ట్విటర్ ద్వారా తెలిపారు. అనంతరం నవంబర్ 15న ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు.