Selfie Train Deaths: మధ్యప్రదేశ్ బేతూల్ జిల్లాలో ఘోరం జరిగింది. రైల్వే వంతెనపై సెల్ఫీలు తీసుకుంటున్న ఇద్దరు యువకులను రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మచనా నదిపై ఉన్న రైల్వే వంతెనపై ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
రైలు పట్టాలపై సెల్ఫీలు- ఇద్దరు దుర్మరణం - Death on railway track
Selfie Train Deaths: రైలు వంతెనపై సెల్ఫీ సరదా ఇద్దరు నిండు ప్రాణాలను బలితీసుకుంది. రైల్వే వంతెనపై సెల్ఫీ తీసుకుంటుండగా.. ఇద్దరు యువకులను రైలు ఢీకొట్టింది.
రైలు
ముఖేష్ ఉయికే, మనీల్ మార్స్కోల్ (19)లు పెళ్లికని ఇంటినుంచి బయలుదేరారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 3గంటల సమయంలో రైల్వే వంతెనపై సెల్ఫీ తీసుకుంటున్నారు. ఆ సమయంలో అటునుంచి వచ్చే భాగమతి రైలును యువకులు గమనించలేదు. వేగంగా దూసుకొచ్చిన రైలు.. ఇద్దరు యువకులను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.