Self Immolation At Supreme Court: దేశ సర్వోన్నత న్యాయస్థానం దగ్గర ఓ వ్యక్తి (50) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తిని నోయిడాకు చెందిన రాజ్‌భర్ గుప్తాగా పోలీసులు గుర్తించారు.
'ఫ్యాన్ల తయారీ కంపెనీలో గుప్తా సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. గత మూడు నెలలుగా జీతం రాలేదు. ఈ వేదనతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.' అని పోలీసులు తెలిపారు. బాధితుడు కాలిన గాయాలతో ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మంటల్లో బాధితుడు ' సాహెబ్ జీ నేను పేదవాన్ని. నా కుటుంబం ఆకలితో అలమటిస్తోంది' అని అన్నాడు.