దేశీయంగా అభివృద్ధి చేసిన కొత్త తరం ఆకాశ్ క్షిపణిని(ఆకాశ్-ఎన్జీ) భారత్ విజయవంతంగా పరీక్షించింది. రెండు రోజుల వ్యవధిలో ఆకాశ్‌కు ఇది రెండో పరీక్ష కాగా ఈసారి ప్రతికూల వాతావరణంలో క్షిపణి నిర్దేశిత పనితీరు కనబరిచినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) పేర్కొంది. ఒడిశా బాలేశ్వర్‌లోని ఇంటిగ్రేడెట్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్షలు చేపట్టారు.
గగనతలంలో వేగంగా దూసుకెళ్తున్న మానవరహిత లోహ విహంగాన్ని ఆకాశ్ గురి తప్పకుండా ఛేదించిందని డీఆర్డీఓ తెలిపింది.