తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో రాష్ట్రంలో ఆ వ్యాధి​ కలకలం- ప్రభుత్వం అలర్ట్

స్క్రబ్ టైపస్ వ్యాధి మరో రాష్ట్రంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్​లోని ఐదు జిల్లాల్లో ఈ కేసులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. వైద్య సన్నద్ధతకు చర్యలు చేపట్టింది.

Scrub Typhus reported in five districts of MP, Government issues alert
మధ్యప్రదేశ్​లో స్క్రబ్​ టైపస్ కలకలం

By

Published : Sep 8, 2021, 3:10 PM IST

మధ్యప్రదేశ్​లోని ఐదు జిల్లాల్లో స్క్రబ్​ టైఫస్(Scrub Typhus) కేసులు వెలుగు చూడటం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. వైద్య సన్నద్ధతకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.

రాయ్​సేన్​, నర్గింగ్​పుర్, సత్నా, దమోహ్, ​కట్నీ జిల్లాల్లో ఈ కేసులు గుర్తించినట్లు మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ వ్యాధి చికిత్సకు(Scrub Typhus Treatment) మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రజలకు అన్ని విధాలా వైద్యసాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు. జులై-డిసెంబర్ మధ్య అధికంగా ప్రబలే ఈ వ్యాధి బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు(Scrub Typhus Prevention) తీసుకోవాలని సూచించారు.

స్క్రబ్ టైఫస్ అంటే?

స్క్రబ్ టైఫస్​ను బుష్ టైఫస్​ అని కూడా అంటారు. ఓరియెన్​షియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈశాన్య ఆసియా, ఇండోనేషియా, చైనా, జపాన్, భారత్, ఉత్తర ఆస్ట్రేలియాల్లో ఇది ఎక్కువగా వెలుగుచూస్తుంది. స్క్రబ్ టైఫస్ సోకిన చిగ్గర్స్ (లార్వా పురుగులు) కాటు ద్వారా ప్రజలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

లక్షణాలు

చిగ్గర్ కుడితే వచ్చే దద్దుర్లు

స్క్రబ్ టైఫస్ లక్షణాలు(Scrub Typhus Symptoms) కూడా ఎన్నో ఇతర రోగాల లక్షణాలకు దగ్గరగా ఉంటాయి. పురుగు కుట్టిన 10 రోజుల్లో ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు బయటపడుతుంటాయి. అవి..

  • జ్వరం, చలి జ్వరం
  • తల నొప్పి
  • ఒళ్లు, కండరాల నొప్పులు
  • పురుగు కుట్టిన చోట నల్లటిమచ్చ
  • మానసిక మార్పులు (భ్రమ నుంచి కోమా వరకు)
  • ఒంటిపై ఎర్రటి దద్దుర్లు
  • తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి అవయవాల వైఫల్యం, రక్తస్రావం జరిగి చికిత్స అందించకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.
    చిగ్గర్ కాటు

చికిత్స ఎలా?

పై లక్షణాలు కనపడినా, ఈ వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో సంచరించినా ఆ సమాచారం వైద్యులకు వెల్లడించాలి. వైద్యులు.. రక్త పరీక్షలు చేయవచ్చు. టెస్టు రిపోర్టులు రావడానికి వారాల సమయం పడుతుంది. కాబట్టి అంతకన్నా ముందే చికిత్స ప్రారంభించే అవకాశం ఉంది.

ఈ చికిత్సలో డోక్సిసైక్లిన్ అనే యాంటీబయోటిక్ వాడతారు. అది అన్ని వయసుల వారికీ ఇవ్వొచ్చు. లక్షణాలు కనబడిన వెంటనే ఇది ఇస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

వ్యాధి సోకిన పెద్దలకు 200ఎంజీ డాక్సీసిలిసిన్​తో పాటు 500ఎంజీ అజిత్రోమైసిన్ కనీసం ఐదు రోజులు ఇవ్వాలి

పిల్లలకయితే 4.5ఎంజీ డాక్సీసిలిసిన్​, 10 ఎంజీ అజిత్రోమైసిన్​ ఇవ్వాలి

గర్భిణీలకు 500ఎంజీ అజిత్రోమైసిన్ ఇవ్వాలని మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది.

హిమాచల్ ప్రదేశ్​లోనూ..

ఉత్తర్​ప్రదేశ్​, హిమాచల్​ప్రదేశ్​లో నాలుగు స్క్రబ్​ టైఫస్(Scrub Typhus in India)​ కేసులు వెలుగు చూశాయి.

ఇదీ చదవండి:Nipah Virus: నిఫా వైరస్​ పరీక్షల్లో ఆ 30 మందికి నెగెటివ్

ABOUT THE AUTHOR

...view details