తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అగ్నిపథ్​పై​ పిటిషన్లన్నీ దిల్లీ హైకోర్టుకే.. అప్పటి వరకు ఆగండి!' - సుప్రీం కోర్టు

Agnipath Supreme Court Case: అగ్నిపథ్​ పథకాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. మిగతా రాష్ట్రాల్లో పెండింగ్​లో ఉన్న ఈ తరహా కేసులను కూడా కావాలనుకుంటే అక్కడికే బదిలీ చేయొచ్చని స్పష్టం చేసింది.

SC transfers PILs pending before it, other high courts against Agnipath to Delhi HC
అగ్నిపథ్​ సవాల్​ పిటిషన్లన్నీ దిల్లీ హైకోర్టుకే.. అక్కడే వాదనలు

By

Published : Jul 19, 2022, 2:30 PM IST

Agnipath Supreme Court Case: సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లంటినీ దిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. కేరళ, పంజాబ్​ అండ్​ హరియాణా, పట్నా, ఉత్తరాఖండ్​ హైకోర్టుల్లోనూ అగ్నిపథ్​ను వ్యతిరేకిస్తూ దాఖలైన పెండింగ్​ పిటిషన్లను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఆయా పిటిషన్​దారులు.. దిల్లీ కోర్టులోనూ వాదనలు వినిపించవచ్చని స్పష్టం చేసింది జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.

పెండింగ్​ కేసులు బదిలీ చేయకున్నా లేదా పిటిషనర్లు అభ్యంతరం తెలిపినా.. దిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు విచారణ ఆపాలని ఆయా కోర్టులకు చెప్పింది సుప్రీం. అగ్నిపథ్​పై ఇప్పటికే పెండింగ్​లో ఉన్న కేసులు సహా తాము బదిలీ చేసిన పిటిషన్​లను కూడా పరిశీలించాలని దిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.

Agnipath Scheme: త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకుగాను 'అగ్నిపథ్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ ​14న ప్రకటించింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని పేర్కొంది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఈ ఏడాది రిక్రూట్​మెంట్‌లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కూడా ప్రకటించింది. కానీ ఈ స్కీమ్​కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల యువత హింసాత్మక నిరసనలు చేపట్టింది. మరోవైపు రిక్రూట్​మెంట్​ కోసం దరఖాస్తులు కూడా భారీగా వచ్చాయి.

ఇవీ చూడండి:అపోహల అగ్నిపథం.. తొలగిస్తే విజయపథం..

'అగ్నిపథ్'​కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు.. చరిత్రలో తొలిసారి..

ABOUT THE AUTHOR

...view details