తెలంగాణ

telangana

'బంగాల్​ స్థిరాస్తి చట్టం రాజ్యాంగ విరుద్ధం'

బంగాల్​లో.. రియల్​ ఎస్టేట్​ రంగానికి సంబంధించి​ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దానిని రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించింది.

By

Published : May 4, 2021, 12:58 PM IST

Published : May 4, 2021, 12:58 PM IST

SC strikes down WB law on regulating real estate, holds it unconstitutional
బంగాల్​ స్థిరాస్తి చట్టం రాజ్యాంగ విరుద్ధం: సుప్రీం

స్థిరాస్తి రంగాన్ని నియంత్రించేందుకు బంగాల్​ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. పార్లమెంటు పరిధిలో ఉన్న అంశాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టం ద్వారా చొరబడిందని పేర్కొంది. అందుకే అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

బంగాల్​ ప్రభుత్వం తీసుకొచ్చిన వెస్ట్​ బెంగాల్​ హౌసింగ్​ ఇండస్ట్రీ రెగ్యులేషన్​ యాక్ట్​(హెచ్​ఐఆర్​ఏ) 2017.. కేంద్రానికి చెందిన రియల్​ ఎస్టేట్​(రెగ్యులేషన్​ అండ్​ డెవలప్​మెంట్​) యాక్ట్​ ఇంచుమించు ఒకే విధంగా ఉన్నాయని జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్​ ఎమ్​ ఆర్​ షాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అందువల్ల బంగాల్​ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.

అయితే ఈ తీర్పునకు ముందు ఆస్తులు కొన్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు అవుతాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

హెచ్​ఐఆర్​ఏ చట్టబద్ధతను సవాలు చేస్తూ.. ఫారం ఫర్​ పీపుల్స్​ కలెక్టివ్​ ఎఫర్ట్స్​ అనే అసోసియేషన్​ దాఖలు చేసిన పిటిషన్​పై విచారించిన అనంతరం ఈ తీర్పును వెలువరించింది ధర్మాసనం.

ఇదీ చూడండి:-సంపూర్ణ లాక్​డౌన్​ను పరిశీలించండి: సుప్రీం

ABOUT THE AUTHOR

...view details