తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అప్పటి వరకు అర్ణబ్​ను అరెస్టు చేయవద్దు' - supreme court on maharastra assembly latest news

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ ​గోస్వామి అరెస్టుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఆదేశాల ధిక్కరణ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు అర్ణబ్​ను అరెస్టు చేయకూడదని స్పష్టంచేసింది.

SC show cause notice to Maha assembly secy for writing to Arnab, protect him from arrest
'అప్పటి వరకు అర్ణబ్​ను అరెస్టు చేయవద్దు'

By

Published : Nov 6, 2020, 5:43 PM IST

Updated : Nov 6, 2020, 8:14 PM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఆదేశాల ధిక్కరణ కేసుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి పిటిషన్‌పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ జరిగే వరకు అర్ణబ్​ను అరెస్టు చేయకూడదని పోలీసులను ఆదేశించింది.

మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి కోర్టు ధిక్కారం కింద షోకాజ్ నోటీసులు ఎందుకు జారీ చేయకూడదని సీజేఐ జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను విమర్శించినందుకు అర్ణబ్​పై మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి ప్రత్యేక హక్కు నోటీసు ఇవ్వగా ఈ మేరకు కోర్టు స్పందించింది.

ఇప్పటికే అరెస్టు

2018లో 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్‌ అన్వయ్ నాయక్‌, అతడి తల్లి ఆత్మహత్యకు పాల్పడేలా ఉసిగొల్పారనే కేసులో బుధవారం రాయ్‌గఢ్ పోలీసులు అర్ణబ్​ను అరెస్టు చేశారు. ఆయనకు జిల్లా కోర్టు రెండు వారాల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Last Updated : Nov 6, 2020, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details