బాణసంచాను ఈ ఏడాది పూర్తిగా నిషేధించాలని(firecracker ban in india) కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. టపాసులను రాష్ట్రంలోకి దిగుమతి చేసుకోకుండా ప్రవేశమార్గాల వద్దే నిలువరించేలా చర్యలు చేపట్టేందుకు బంగాల్ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ అజయ్ రస్తోగితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.
దీపావళి, కాళీ పూజ, ఛఠ్ పూజ, జగధాత్రి పూజ, గురునానక్ జయంతి వంటి ఉత్సవాల్లో బాణసంచా కాల్చకుండా నిషేధం విధిస్తూ(firecrackers ban ) అక్టోబర్ 29న ఆదేశాలిచ్చింది కోల్కతా హైకోర్టు. కరోనా నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మైనపు, నూనె దివ్వెలను మాత్రం వెలిగించుకోవచ్చని చెప్పింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం సోమవారం విచారించింది.