దేశంలో ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీకి సంబంధించి అధికారుల తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ట్రైబ్యునళ్లు ఉండడం అధికారులకు ఇష్టం లేనట్లు కనిపిస్తోందంటూ వ్యాఖ్యానించింది. ట్రిబ్యునళ్లలో ఖాళీలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అధికారుల తీరుపై సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు.
'ట్రైబ్యునల్స్ ఉండాలా? వద్దా?' - ట్రైబ్యునెల్స్ భర్తీ సుప్రీంకోర్టు
ట్రిబ్యునళ్లలో ఖాళీలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా అధికారుల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. ట్రైబ్యునళ్లు ఉండాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. ట్రైబ్యునళ్లు ఉండడం అధికారులకు ఇష్టం లేనట్లు కనిపిస్తోందంటూ వ్యాఖ్యానించింది.

ట్రైబ్యునెల్స్పై సుప్రీంకోర్టు
ట్రైబ్యునల్స్ లేకుంటేనే మంచిదని బ్యూరోక్రసీ ఏమైనా కోరుకుంటోందా? అని సీజేఐ ప్రశ్నించారు. అధికారుల తీరు చూస్తే అలాగే అనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ట్రైబ్యునళ్లు ఉండాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తదుపరి విచారణ సమయంలో ఈ విషయాన్ని తప్పక చెప్పాలని సొలిసిటర్ జనరల్‌ను సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ ఆదేశించారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పది రోజుల్లో తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేశారు.
ఇదీ చదవండి :'న్యాయమూర్తులకు బెదిరింపులు తీవ్రమైన అంశం'