తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మీరు ఆ పని చేసేసరికి థర్డ్​వేవ్​ కూడా వెళ్లిపోతుంది' - కొవిడ్​ డెత్​ సర్టిఫికెట్లపై సుప్రీంకోర్టు

కొవిడ్​ డెత్​ సర్టిఫికెట్లకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనలో కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి (sc on covid) వ్యక్తం చేసింది. మార్గదర్శకాలు వచ్చేసరికి థర్డ్​వేవ్​ కూడా వెళ్లిపోతుందని వ్యాఖ్యానించింది.

sc on covid
'మీరు మార్గదర్శకాలు ఇచ్చేసరికి థర్డ్​వేవ్​ కూడా వెళ్లిపోతుంది'

By

Published : Sep 3, 2021, 3:49 PM IST

కొవిడ్​ మృతుల డెత్​ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు (sc on covid) అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్గదర్శకాలు రూపొందించే సరికి మూడో దశ కూడా వెళ్లిపోతుందని జస్టిస్​ ఎంఆర్​ షా, అనిరుద్ధా బోస్​తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెప్టెంబరు 11 లోగా ఇందుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా.. కొవిడ్ మరణాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల జారీపై సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల రూపకల్పన ఆలస్యం కావడంపై దాఖలైన పిటిషన్​ విచారణలో భాగంగా కోర్టు శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలన్న పిటిషన్​పై సర్వోన్నత న్యాయస్థానం జూన్​ 30న కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిహారానికి సంబంధించి ఎంత మొత్తం చెల్లించగలరో మార్గదర్శకాలు రూపొందించాలని అందులో పేర్కొంది.

ఇదీ చదవండి :అండర్​వేర్​తోనే ఎమ్మెల్యే ట్రైన్ జర్నీ​- అదే కారణమట!

ABOUT THE AUTHOR

...view details