తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హిజాబ్'​ వివాదం కేసు బదిలీకి సుప్రీం కోర్టు నిరాకరణ - hijab row news updates

Hijab Row Case: కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ అంశంపై విచారణను కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీ చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హిజాబ్‌ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుందని.. ఈ దశలో జోక్యం సరికాదని అభిప్రాయపడింది.

Supreme court on hijab
Supreme court on hijab

By

Published : Feb 10, 2022, 12:41 PM IST

Hijab Row Case: కర్ణాటకలో సంచలనం రేపిన హిజాబ్​ వివాదానికి సంబంధించి కేసు విచారణను కర్ణాటక హైకోర్టు నుంచి అత్యవసర బదిలీకి సుప్రీంకోర్టు నిరాకరించింది. హిజాబ్​ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుందన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదని అభిప్రాయపడింది. కర్ణాటక హైకోర్టు కోరితే పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

హిజాబ్ కేసును కర్ణాటక హైకోర్టు నుంచి తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్.. సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. వివాదం కారణంగా కర్ణాటకలో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. విద్యార్థినులపై రాళ్లదాడులు జరుగుతున్నాయని.. వివాదం దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని తెలియజేశారు. ఈ అంశమై సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు కోరడం లేదని కేవలం వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన అభర్థనను పరిశీలిస్తామని సీజేఐ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఈ వివాదంపై బుధవారం విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రితురాజ్​ అవస్థి నేతృత్వంలోని ధర్మాసనం.. గురువారం మరోమారు విచారించనుంది.

ఇదీ చూడండి:మహిళ ఘాతుకం- ఐదుగురిని చంపి.. అంత్యక్రియల్లో పాల్గొని..

ABOUT THE AUTHOR

...view details