తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పదోన్నతుల్లో రిజర్వేషన్లపై తేల్చాల్సిన అంశాలేంటి? - sc sc employees promotion reservation

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో న్యాయస్థానం తేల్చాల్సిన అంశాలను గుర్తించి అటార్నీ జనరల్(ఏజీ)​కు తెలియజేయాలని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన యథాతథ ఉత్తర్వులు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో ప్రతిబంధకంగా మారాయని బిహార్​, మహారాష్ట్ర, త్రిపుర వంటి పలు రాష్ట్రాలు విన్నవించాయి. అయితే పలు రాష్ట్రాల నుంచి ఉత్పన్నమైన ఈ కేసుల్లో ప్రస్తావించిన అంశాలు ఒకేలా లేవని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

SC asks states to apprise AG of issues pertaining to grant of quota in promotion to SC/ST employees
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై మేం తేల్చాల్సి అంశాలేంటి?

By

Published : Jan 19, 2021, 7:30 AM IST

వివిధ రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో అవరోధాలు తలెత్తుతున్నాయంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్లు సోమవారం విచారణ జరిపింది. ఈ అంశాల్లో న్యాయస్థానం తేల్చాల్సిన అంశాలను గుర్తించి అటార్నీ జనరల్(ఏజీ)​కి తెలియజేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన యథాతథ ఉత్తర్వులు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో ప్రతిబంధకంగా మారాయని బిహార్​, మహారాష్ట్ర, త్రిపుర వంటి పలు రాష్ట్రాలు విన్నవించాయి.

అయితే పలు రాష్ట్రాల నుంచి ఉత్పన్నమైన ఈ కేసుల్లో ప్రస్తావించిన అంశాలు ఒకేలా లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే, జస్టిస్​ ఎల్​.నాగేశ్వరరావు, జస్టిస్​ వినీత్​ సరన్​లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అందువల్ల నిర్ధిష్టంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను విడివిడిగా అటార్నీ జనరల్​కు తెలియజేయాలని ఆదేశించింది. వీటిని అందుకున్నాక ఏజీ, సంబంధిత రాష్ట్రాల తరఫు న్యాయవాదులతో సదస్సు నిర్వహించి సుప్రీంకోర్టు తేల్చాల్సిన అంశాలను ఖరారు చేయాలని సూచించింది.

ఇదీ చూడండి: సాగు చట్టాలపై నేడు సుప్రీం నియమిత కమిటీ భేటీ

ABOUT THE AUTHOR

...view details