SBI SCO recruitment 2023 : భారీగా ఖాళీల భర్తీకి భారతీయ స్టేట్ బ్యాంకు సిద్ధమైంది. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 217 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన రిలీజ్ చేసింది. రెగ్యులర్‌తో పాటు కాంట్రాక్టు పద్ధతిలో ఈ నియామకం చేపట్టనుంది ఎస్బీఐ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు బ్యాంకు అధికారిక వెబ్సైట్ (sbi.co.in)లో అప్లై చేసుకోవాలి. మరి దరఖాస్తు సమయంలో ఏఏ పత్రాలు సమర్పించాలి? అర్హతలు ఏం ఉండాలి? వంటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏ పత్రాలు అవసరం?
ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు వారి వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలతో పాటు విద్యార్హతకు సంబంధించిన డాక్యుమెంట్లను తప్పక సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే ఆన్లైన్ టెస్ట్/ ఇంటర్వ్యూ కోసం అభ్యర్థుల అప్లికేషన్‌ను పరిగణనలోకి తీసుకోరు.
- సంక్షిప్త రెస్యూమె
- గుర్తింపు కార్డు
- వయసు నిర్ధరణ పత్రం
- విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్లు
- ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ (ఉంటేనే)
ముఖ్యమైన తేదీలు..
- అప్లికేషన్ సమర్పించేందుకు చివరి తేదీ 2023 మే 19.
- ఆన్లైన్ టెస్ట్ నిర్వహించే తేదీ- 2023 జూన్
- ఆన్లైన్ టెస్ట్ కోసం కాల్ లెటర్ అందుబాటులో ఉండే తేదీ- పరీక్ష తేదీకి పది రోజుల ముందు
- ఆన్లైన్ పరీక్షను జూన్‌లో నిర్వహించాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. తేదీని ఇంకా ఖరారు చేయలేదు. అయితే, అనివార్య పరిస్థితులు ఎదురైతే తేదీలలో మార్పులు ఉండొచ్చు.
ఖాళీలు ఇలా..
- మొత్తం ఖాళీలు 217
- రెగ్యులర్ పోస్టులు- 182
- కాంట్రాక్ట్ పోస్టులు- 35
SBI SCO qualification : విద్యార్హతలు
- స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులన్నింటికీ ఒకే విధమైన విద్యార్హతలను నిర్ణయించింది ఎస్బీఐ. రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలకు విద్యార్హతల్లో తేడాలు ఏమీ లేవు.
- ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఐటీ/ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్- లేదా వీటికి సమానమైన డిగ్రీ) చేసి ఉండాలి.
- లేదంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంసీఏ, ఎంటెక్/ ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి.
- అభ్యర్థులు 2023-03-31 నాటికి డిగ్రీ పూర్తి చేసినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
- అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అప్లై చేసిన వారికి ముందుగా కాల్ లెటర్స్ పంపిస్తారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా అభ్యర్థులకు చేరవేస్తారు. కాల్ లెటర్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
- ఆన్లైన్ పరీక్షలో మెరుగైన ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
SBI SCO apply online : అప్లై ఇలా..
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఎస్బీఐకి చెందిన రెండు వెబ్సైట్ల ద్వారా క్యాండిడేట్లు అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. bank.sbi/web/careers లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. sbi.co.in/web/careers లింక్‌లోనూ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది.