తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Saryu Nahar Pariyojana: 'నాలుగు దశాబ్దాలలో కానిది నాలుగేళ్లలో పూర్తి' - సరయూ నహర్​ జాతీయ ప్రాజెక్టు న్యూస్​

Saryu Nahar Pariyojana Project: నాలుగు దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న 'సరయూ నహర్​ జాతీయ ప్రాజెక్టు'ను కేవలం నాలుగేళ్లలో పూర్తిచేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఉత్తర్​ప్రదేశ్​లోని బలరామ్​​పుర్​కు శనివారం వెళ్లనున్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్​ చేశారు.

saryu nahar pariyojana project
నరేంద్ర మోదీ

By

Published : Dec 11, 2021, 5:18 AM IST

Updated : Dec 11, 2021, 6:34 AM IST

Saryu Nahar Pariyojana Project News: నాలుగు దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న 'సరయూ నహర్​ జాతీయ ప్రాజెక్టు'ను కేవలం నాలుగేళ్లలో పూర్తిచేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఉత్తర్​ప్రదేశ్​లోని బలరామ్​​పుర్​కు శనివారం వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేశారు.

"ఈ ప్రాజెక్టు 1978లో ప్రారంభమైంది. నాలుగు దశాబ్దాలుగా అసంపూర్తిగానే మిగిలిపోయింది. కానీ మేము నాలుగేళ్లలోనే పూర్తి చేశాం. సుధీర్ఘంగా పెండింగ్​లో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేసింది. యూపీ తూర్పు ప్రాంతంలో రైతుల కష్టాలు ఈ ప్రాజెక్టుతో తీరిపోతాయి."

-ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi: నిధుల లేమితో ఈ ప్రాజెక్టును ఇన్నేళ్లుగా నిలిచిపోయిందని పీఎంఓ తెలిపింది. రైతుల సంక్షేమం కోసం దీనిని పూర్తి చేయాలని ప్రధాని సంకల్పించారని పేర్కొంది. ఈ క్రమంలో 2016లో ఈ ప్రాజెక్టును 'ప్రధాన్​ మంత్రి కృషి సంచాయ్​ యోజన'లో చేర్చి నిర్ణీత సమయంలో పూర్తిచేసినట్లు వెల్లడించింది.

రూ.9,800 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు కోసం గత నాలుగేళ్లలోనే రూ.4,600 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చించింది. ఘగ్గర్​, సరయూ, రాప్తి, బంగాంగా , రోహిణీ నదుల అనుసంధానంతో నీటి వనరులను సద్వినియోగం చేసుకోవచ్చు. 14లక్షల హెక్టార్లకు నీటిని అందించగలదు. 29 లక్షల రైతులు, 6,200 గ్రామాలకు మేలు చేకూరనుందని పీఎంఓ తెలిపింది.

ఇదీ చదవండి:'అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహించటం గర్వంగా ఉంది'

Jayalalitha House: మేనకోడలి చేతికి జయలలిత నివాసం

Last Updated : Dec 11, 2021, 6:34 AM IST

ABOUT THE AUTHOR

...view details